హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ

KRNL: ఆస్పరి (మం) తోగలగల్లులోని శ్రీ ఓబులేషు స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు MP బస్తిపాటి నాగరాజు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఓబులేషు స్వామిని దర్శించుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ నాగరాజును శాలువాలతో సత్కరించారు.