హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మించండి సారూ..!

ASR: డుంబ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయతీ బోడిగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని మాజీ సర్పంచ్ గొల్లూరి గున్ను, గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.