హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి'

MDCL: ఏడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. వికలాంగులకు రూ.6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. డి.మధుసూదన్‌ రెడ్డి, సురేష్ ఉన్నారు.