హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుపై దాడి ఖండనీయం: మాజీ MLA

BHPL: చిట్యాల(M)RB న్యూస్ ప్రతినిధి రవితేజపై జరిగిన దాడిని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను పరామర్శించారు. ఇంట్లోకి వెళ్లి దాడి చేయడం, కులం పేరుతో దూషించడం, కుటుంబ సభ్యులపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవలన్నారు.