హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

NGKL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొని బీజేపీపై విమర్శలు చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.