హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామప్ప దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట లోని రామప్ప దేవాలయంలో సోమవారం నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.