BHPL: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని BHPL మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ మహిళా విభాగం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతులకు ఎకరాకు రూ.15 వేల సాయం, రైతుబీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలి'


