హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్లపై ఉత్కంఠ

వరంగల్‌ పట్టణంలోని మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్ల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. గత నెల 29న ప్రారంభమైన బిడ్ల దాఖలు ప్రక్రియ ఈనెల 12న ముగిసింది. టెండర్‌దారులు రూ.6.10 కోట్ల ఈఎండీని సీపీపీ పోర్టల్‌లో జమ చేయాల్సి ఉంది. తొలి కవర్‌ను ఈనెల 18న ఉదయం 11 గంటలకు, రెండో కవర్‌ను సెప్టెంబర్‌ 7న మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు.