హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల నిలిపివేతపై బీఆర్‌ఎస్ ధర్నా

MLG: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్‌163పై ధర్నా నిర్వహించారు. పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో హైవేపై వాహనాలు నిలిచిపోగా పోలీసులు చేరుకుని ఆందోళనకారులను విరమింపజేశారు.