హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో మంటలను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని వెంటనే రోడ్డు పక్కన నిలిపాడు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు కిందకు దిగి సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది.