హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామలో రంగవల్లి పోటీలు

జనగామ జిల్లా కేంద్రంలోని సత్సంగ భవనంలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ఇస్కాన్ కమిటీ ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు పోటీల్లో పాల్గొనాలని, అవసరమైన రంగులను స్వయంగా తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు.