హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్.. 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు తడబడుతున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. మానవ్ సూతార్ 2, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సోనల్ దినూస (14), నిరోషన్ (8) క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది.