హైదరాబాద్: 28°C
క్రీడలు

'ది హండ్రెడ్' మెన్స్ విజేతగా సూపర్ జెయింట్స్

'ది హండ్రెడ్' మెన్స్ టోర్నీ - 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ అవతరించింది. ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 158 పరుగుల లక్ష్యాన్ని టీమ్ సీఫర్ట్ 38 బంతుల్లో 72 పరుగులతో చెలరేగడంతో జెయింట్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కాగా, సంజీవ్ గోయెంకా ఈ జట్టు ఓనర్‌గా ఉన్నారు.