హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొమురవెల్లి దేవస్థానం దగ్గర కోతుల బెడద

SDPT: కొమురవెళ్లి మల్లికార్జున స్వామి నిత్య అన్నదాన సత్రం పరిసరాల్లో కోతులు గుంపులుగా తిరుగుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సత్రం వైపు వచ్చే భక్తులపై దాడి చేస్తూ, చేతిలోని ఆహార పదార్థాలు, ప్రసాదాలను లాక్కుంటున్నాయి. చిన్నారులు, వృద్ధులు అటు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.