హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూచిపూడి నృత్యంలో రికార్డు సాధించిన చతుర్వేద

WNP: పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన అనుష రవిబాబు దంపతుల కుమార్తె చతుర్వేద కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకుంది. మూడేళ్లుగా శిక్షణ పొందుతున్న చతుర్వేద హైదరాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్లో అద్వైత్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చింది. నిర్వాహకులు ఆమెకు ప్రశంసాపత్రం, మెడల్ అందజేశారు.