హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంట్వారంలో ప్రజావాణికి విశేష స్పందన

VKB: బంట్వారం మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ధరణి భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.