హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్‌లో నో స్టాక్.. ఇబ్బందుల్లో రైతులు

MDK: పీఏసీఎస్‌లో యూరియా దొరక్క చిన్నశంకరంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు ఎరువులు అవసరం కావడంతో ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నామని, తీరా సొసైటీకి వెళ్లి ఆ కోడ్ చూపిస్తే 'నో స్టాక్' అని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్ చేసుకున్నా ఎరువులు ఇవ్వకపోవడంపై రైతన్నలు ఆగ్రహం, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.