హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

WNP: కొత్తకోట జాతీయ రహదారి–44పై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని శివాజీ విగ్రహం సమీపంలో గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే వారిని చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.