హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుబంధు ఇప్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

KMR: బీబీపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు ఫిర్యాదులు చేశారు. యాడారం గ్రామానికి చెందిన కమ్మరి శేషయ్య తనకు రైతుబంధు అందడం లేదని ఎంపీడీవో గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.