WGL: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఈ నెల 18న ఘనంగా నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా నాయకులు తెలిపారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి బహుజన రాజ్యాధికారాన్ని చాటిన పాపన్న గౌడ్ విగ్రహం రాజధానిలో కొలువుదీరడం చారిత్రక ఘట్టమన్నారు. కార్యక్రమానికి బహుజనులు, ప్రజా సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
"ఈనెల 18న సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ "


