హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెజ్జంకి మండలంలో నాగుల పంచమి వేడుకలు

SDPT: బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాము పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలకు పాలు పోసి నాగదేవతను ఆరాధించి, కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది.