BHNG: భువనగిరి పట్టణంలో సోమవారం నాగుల పంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు నాగపుట్టలను ప్రత్యేకంగా పూజించారు. పూలు, పండ్లు, పాలు, కొబ్బరికాయలు, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వేడుకల్లో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: భువనగిరిలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు


