BPT: చినగంజాంలో ఎండల తీవ్రతతో ఉప్పు దిగుబడులు గణనీయంగా పెరిగాయి. సాధారణంగా జూన్‌తో ముగిసే ఉప్పు తీతలు ఈసారి ఆగస్టులోనూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వారానికి ఎకరానికి సుమారు 50 క్వింటాళ్ల ఉప్పు లభిస్తోంది. దీంతో రైతులు కొంత ఉప్పును విక్రయిస్తూ, మిగతాది నిల్వ చేస్తున్నారు. ఎండలు అధికంగా ఉండటంతో కూలీలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం లోపే ఉప్పు తీతలు పూర్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పెరిగిన ఉప్పు దిగుబడులు


