హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా ప్రధాన రహదారి

PDPL: ధర్మారం ఎక్స్‌రోడ్డు నుంచి రాజారాంపల్లి వరకు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల భారీ వాహనాలు బోల్తాపడిన ఘటనలు చోటుచేసుకున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.