హైదరాబాద్: 28°C
తెలంగాణ

నటి అనసూయపై కేసు నమోదు

హైదరాబాద్‌లో నటి అనసూయకు షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైనట్లు సమాచారం. అనసూయ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.