JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్మశానవాటిక వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పూర్తిగా పాచితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దహన సంస్కారాల అనంతరం స్నానం చేయడానికి, కాళ్లు చేతులు కడుక్కోవడానికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. పాచితో జారిపడే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే ట్యాంక్‌ను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
స్మశానవాటిక వద్ద అపరిశుభ్రంగా వాటర్ ట్యాంక్


