హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు క్యాతంపల్లి ఆలయంలో నాగులపంచమి

HNK: ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లి శివారులోని నవనాగ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగులపంచమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి విశేష అభిషేకం, నవనాగ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ గంటా పవన్‌శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.