హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోబా ఆలయానికి భక్తుల తాకిడి

ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శ్రావణ సోమవారం, నాగుల పంచమి కలిసిరావడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. మెస్రం వంశీయులు ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.