హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఈ దారి నరకానికి దారి..!

NTR: తిరువూరు - మధిర రహదారి గోతులమయంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. పీటీ కొత్తూరు నుండి గంపలగూడెం వరకు రోడ్డు దారుణంగా ఉంది. గోతుల్లో పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షంలో గుంతలు కనిపించక భారీ వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. పాలకులు, అధికారులు రోడ్డు దుస్థితిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.