NDL: ఆళ్లగడ్డ(M) పెద్ద కందుకూరుకు చెందిన హుస్సేన్ షా కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.4.40 లక్షల చెక్కును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. అవసరమైన వారికి సీఎంఆర్‌ఎఫ్ సాయం అందేలా కృషి చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో CMRF చెక్కులు పంపిణి


