హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో జిల్లా వాసి మృతి

అన్నమయ్య: అమెరికాలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన బొంగుటావుల దిలీప్‌కుమార్ మృతదేహాన్ని చిట్వేలు మండలం జట్టువారిపల్లికి తీసుకువచ్చారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారిని చూసి గ్రామస్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.