హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వరస్వామిని తాకిన సూర్యకిరణాలు

ATP: పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయాన్నే భాస్కరుడి తొలి కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.