హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

PLD: సత్తెనపల్లి(M) ధూళిపాళ్ల సమీపంలోని ప్రధాన రహదారి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతుని వయసు సుమారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. అతని శరీరంపై తెలుపు, నలుపు గళ్ల చొక్కా ఉందని రూరల్ సీఐ హైమారావు తెలిపారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి రూరల్ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.