హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నాటికి 23.112 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 160 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2200 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.