హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు లేక 'పులస' కోసం ఎదురుచూపులు

ఆగస్టులోనూ వరుణుడి కరుణ లేక గోదావరి జిల్లాల మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు. ఏటా ఈ సమయానికి వరద నీటితో గోదావరి పోటెత్తి, తీపి నీటి ప్రవాహానికి ఆకర్షితమైన పులసలు సముద్రం నుంచి నదిలోకి ఎదురీదే పులసలు. ఈసారి వర్షాభావంతో వరద ప్రవాహం లేకపోవడంతో పులసల జాడ కనిపించడం లేదని గంగపుత్రులు వాపోతున్నారు. దీంతో పులస ప్రియులు విలసలతోనే సరిపెట్టుకుంటున్నారు.