హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం..!

కృష్ణా: మోపిదేవి పంచాయతీ పరిధిలో మూడో వార్డులో డ్రైనేజీ పూడికతీత లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దుర్వాసన వస్తూ, బ్లీచింగ్ కూడా చల్లడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగుతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్న ప్రజలు, తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను కోరుతున్నారు.