హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ దొంగల ముఠాకు చెక్

RR: మొయినాబాద్ మండలంలో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చేవెళ్ల జోన్ డీసీపీ గౌతమ్ తెలిపారు. పాత అజీజ్‌నగర్ రోడ్డులో ప్రధాన నిందితుడు మహ్మద్ షాబాజ్‌తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి సుమారు 8 బైక్‌లు, విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని, కాలపత్తర్‌లోని షాబాజ్ నివాసంలో ఐదు వాహనాలను గుర్తించామని తెలిపారు.