SKLM: కవిటి మండలం ప్రగడ పుట్టుగకు చెందిన సోమేశ్ దొలై కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. మృతుడికి కుమారులు లేకపోవడంతో చిన్న కుమార్తె పావని తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె


