హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉప్పాడ వద్ద రోడ్డుపై దిగబడిన ఆర్టీసీ బస్సు

కాకినాడ - అద్దరిపేట మార్గంలో వెళ్తున్న RTC బస్సు ఆదివారం ఉప్పాడ వద్ద రోడ్డు పక్కన దిగబడింది. ఇక్కడ నూతన రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో వాహనాలు పక్కనుంచి వెళ్తున్నాయి. బస్సు దిగబడటంతో ప్రయాణికులను కిందకు దింపినా ఫలితం లేకపోయింది. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎట్టకేలకు బస్సును పైకి తీసి ప్రయాణికులతో వెళ్లారు.