హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూషణరావుపేటలో పెద్ద హనుమాన్ విగ్రహానికి భూమిపూజ

JGL: భూషణరావుపేటలో పెద్ద హనుమాన్ విగ్రహ నిర్మాణానికి గ్రామస్థులు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. దాతల ఆర్థిక సహకారంతో గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామం నుంచి నిర్మాణ స్థలం వరకు ఊరేగింపుగా వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పనులు త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు.