MDK: హవేలీ ఘన్‌పూర్, బూరుగుపల్లి నుంచి లింగంపేటకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మాల్తుమ్మెద గేట్ వద్ద ఎన్‌హెచ్-765డీపై నిర్వహించిన తనిఖీల్లో 29 సంచుల్లోని 14.5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తొగిట బాలరాజు, మెంగరబోయిన యేసుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
రేషన్ బియ్యం స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు.


