హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మండల స్థాయిలోనే ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం'

ADB: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నుంచి 'మండల ప్రజావాణి' కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే స్వీకరించి, సత్వర పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దీని విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.