హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో తేళ్ల పంచమి

 NRPT: జిల్లా సరిహద్దులోని కందుకూరు కొండమవ్వ సన్నిధిలో తేళ్ల పంచమిని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈరోజు ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న రాళ్లను తొలగిస్తే వాటి కింద తేళ్లు దర్శనమిస్తాయి. భక్తులు భయపడకుండా వాటిని చేతితో పట్టుకుంటారు. తేళ్లు కుట్టవని నమ్మకంతో పూజలు చేస్తారు. ఏటా శ్రావణ మాసంలో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది.