RR: పెద్దేముల్ మండలంలోని గొట్లపల్లి గ్రామ శివారులోని మిత్ర సోలార్ ప్లాంట్ వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పెద్దేముల్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.6,750 నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి


