హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో నేడు బీఆర్‌ఎస్ నిరసన

VKB:​ కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ పరిగిలో బీఆర్‌ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఉదయం 9:30 గంటలకు ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావాలని కేఎంఆర్ కార్యాలయం కోరింది.