MBNR: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హైమాస్ట్ లైట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యేను సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
హై మాస్ట్ లైట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే


