MDCL: బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొనడంతో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొల్లారానికి చెందిన వివేక్ రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రైలు ఢీకొని యువకుడు మృతి


