BHNG: ట్రాక్టర్ పల్టీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన అడ్డగూడూరు మండలం పరిధి చౌళ్లరామారంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఎల్లబోయిన సాయికుమార్(23) బోనాల సందర్భంగా గ్రామానికొచ్చాడు. నిన్న సాయంత్రం ఆలయం చుట్టూ తిరుగుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులోకి పల్టీకొట్టింది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు.
తెలంగాణ
ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడు మృతి.!


