హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్ సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి

SRPT: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సూర్యాపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర టీచర్స్ సెల్ కో-కన్వీనర్ సాయిరెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు.