జనగామ పట్టణంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, జీవో 25 రద్దు చేయాలని ఆదివారం కోరారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 51 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.
తెలంగాణ
VIDEO: సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష


